హైదరాబాద్ మహా నగరం మరో అంతర్జాతీయ సదస్సుకు వేదికైంది. హైటెక్ సిటీలోని హెచ్‌ఐసీసీలో గ్లోబల్ ఏఐ సమ్మిట్ అట్టహాసంగా ప్రారంభమైంది. 40కి పైగా దేశాల నుంచి ప్రముఖ సాంకేతిక నిపుణులు, శాస్త్రవేత్తలు, సీఈవోలు హాజరయ్యారు.
రాష్ట్రంలో యువతకు ఏఐ రంగంలో శిక్షణ ఇవ్వడంతో పాటు, సుమారు రూ. 10,000 కోట్ల విలువైన సరికొత్త ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు ఒప్పందాలు కుదిరాయి.